శివాజీ ఇచ్చిన ధైర్యమే ఇది .. మాట నిలబెట్టుకుంటా: పల్లవి ప్రశాంత్
- బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్
- తనకి హైదరాబాద్ పెద్దగా తెలియదని వెల్లడి
- శివాజీ కోసమే అయితే ఎవిక్షన్ పాస్ వాడేవాడినని వ్యాఖ్య
- రైతులకు సాయం చేసి మాట నిలబెట్టుకుంటానని స్పష్టీకరణ
'బిగ్ బాస్ సీజన్ 7' విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. 35 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. తాజాగా గీతూ రాయల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " మేము పండించిన పంటను కూకట్ పల్లిలో అమ్ముతూ ఉంటాము. అందువలన నాకు హైదరాబాదులో కూకట్ పల్లి తప్ప మరేమీ తెలియదు. అలాంటి నేను 'బిగ్ బాస్' విజేతగా నిలవడం నేనే నమ్మలేకపోతున్నాను" అన్నాడు.
" రైతు బిడ్డలను గురించి కొంతమంది చులకనగా మాట్లాడటం విన్నాను. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాలనే నేను ఇక్కడికి వచ్చాను. హౌస్ లో నేను మొదటసారి మాట్లాడింది రతికతోనే. అంతకుముందు మాదిరిగానే ఆమె నాతో మంచిగా ఉంటే, ఆమె కోసం 'ఎవిక్షన్ పాస్' వాడేవాడినే. ఒకవేళ ఆ స్థానంలో శివాజీ - యావర్ ఉంటే, శివాజీ కోసమే ఎవిక్షన్ పాస్ వాడేవాడిని" అని చెప్పాడు.
"బిగ్ బాస్ హౌస్ లోకి పోయినప్పుడు నాకు ఎవరూ తెలియదు. మొదటి నుంచి కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చింది శివాజీ అన్నయ్యనే. నేను గెలిస్తే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తానని నన్ను ముందుకు తీసుకుని వెళ్లాడు. ముందుగానే చెప్పినట్టు నేను గెలుచుకున్న 35 లక్షలు రైతుల కోసమే ఖర్చు చేస్తాను. ప్రతి రూపాయికి లెక్కరాసి మీకు చూపిస్తాను" అని చెప్పాడు.