వరల్డ్ కప్ లో రాణించిన శ్రీలంక పేసర్ కు ఐపీఎల్ లో భారీ ధర

  • దుబాయ్ లో ఐపీఎల్ మినీ వేలం
  • దిల్షాన్ మధుశంకను రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
  • వరల్డ్ కప్ లో 21 వికెట్లు తీసిన మధుశంక
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో శ్రీలంక ఓ జట్టుగా విఫలం అయినప్పటికీ, యువ పేసర్ దిల్షాన్ మధుశంక తన బౌలింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 23 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ సీమర్ భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ లో 21 వికెట్లు సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం. అతడి బౌలింగ్ నైపుణ్యానికి ఐపీఎల్ లో న్యాయం జరిగింది. 

దిల్షాన్ మధుశంకను నేటి వేలంలో రూ.4.6 కోట్లతో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. కొత్త బంతితో తొలి ఓవర్లలో వికెట్లు తీయడం, పాత బంతితో చివరి ఓవర్లలో పరుగులు రాకుండా తెలివిగా బంతులు వేయడం మధుశంక ప్రత్యేకత. అతడి బౌలింగ్ లో మంచి పేస్ ఉండడంతో భారత పిచ్ లపై ఇటీవల వరల్డ్ కప్ లో మెరుగ్గా రాణించాడు. 

ఇవాళ్టి వేలంలో మధుశంక కోసం ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ హోరాహోరీ పోటీపడ్డాయి. చివరికి అతడిని ముంబయి ఇండియన్స్ చేజిక్కించుకుంది .


More Telugu News