అదనపు రుణాలు పొందేందుకు ఏపీ సహా 6 రాష్ట్రాలకు అనుమతినిచ్చిన కేంద్రం

  • విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం చేయూత
  • అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు అనుమతి
  • ఏపీకి మరో రూ. 5,858 కోట్ల అప్పు తీసుకునే వెసులుబాటు
విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేసినందుకు గాను అదనపు రుణాలు పొందేందుకు 6 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు అనుమతిని మంజూరు చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ 6 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 రాష్ట్రాలకు ఈ అవకాశం లభించగా... ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే అనుమతి రావడం గమనార్హం. ఈ 6 రాష్ట్రాల్లో ఏపీ, అసోం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ కల్పించిన అవకాశంతో ఏపీ ప్రభుత్వం మరో రూ. 5,858 కోట్ల అప్పును తీసుకునే వెసులుబాటు కలిగింది.


More Telugu News