జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు సఫలం

  • ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెపై వెనక్కి తగ్గిన జూడాలు
  • ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదల చేస్తామన్న మంత్రి దామోదర
  • రెండు నెలల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్న జూడాలు
జూనియర్ డాక్టర్లతో (జూడా) రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మెపై వెనక్కి తగ్గారు. వారితో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదల చేస్తామని జూడాలకు మంత్రి హామీ ఇచ్చారు. జూడాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మంత్రి హామీ ఇవ్వడంతో తాము సమ్మెకు వెళ్ళబోవడం లేదని జూడాలు ప్రకటించారు. రెండు నెలల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి దామోదర హామీ ఇచ్చినట్లు జూడాలు వెల్లడించారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కూడా కలిపిస్తామని చెప్పారని చెప్పారు. స్టేట్ వైడ్‌గా డీఎన్‌బీ 46 మంది ఉన్నారని, వారికి స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.


More Telugu News