డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ 'టోబి' .. సోనీలివ్ లో!
- కన్నడలో ఇటీవల విడుదలైన 'టోబి'
- రాజ్ బి.శెట్టి నటనకు దక్కిన ప్రశంసలు
- దర్శకత్వం వహించిన బాసిల్
- ఈ నెల 22 నుంచి జరగనున్న స్ట్రీమింగ్
కన్నడలో ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన సినిమాలలో 'టోబి' ఒకటిగా కనిపిస్తుంది. రాజ్ బి.శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి, బాసిల్ దర్శకత్వం వహించాడు. రాజ్ బి. శెట్టి ఎంచుకునే కథలు .. పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయనే సంగతి, ఆయన గత చిత్రాలను చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమాలోను ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు.
ఈ సినిమాలో చైత్ర ఆచార్ .. రాజ్ దీపక్ శెట్టి .. గోపాల్ దేశ్ పాండే .. సంయుక్త ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొత్తగా అనిపించే కథాకథనాలతో రూపొందిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను సోనీలివ్ వారు ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
రవి రాయ్ నిర్మించిన ఈ సినిమాకి మిథున్ ముకుందన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో హీరో బాల్యమంతా ఎంతో అసంతృప్తిగా గడుస్తుంది. అతణ్ణి చేరదీసినవారు పెట్టిన పేరే 'టోబి'. అతనిలో ఆవేశం ఎక్కువ. కొంతమంది తమ ప్రయోజనాల కోసం అతణ్ణి వాడుకుంటూ ఉంటారు. అది గ్రహించిన 'టోబి' ఏం చేస్తాడు?' అనేదే కథ.