జైపూర్ లో మంచు కురిస్తే ఇదిగో ఇలా ఉంటుందట..!

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఏఐ జెనరేటెడ్ ఫొటోలు
  • కశ్మీర్ కంటే జైపూర్ అందంగా ఉందంటున్న నెటిజన్లు
  • నిజంగా మంచు కురిస్తే దేశంలోనే సుందరమైన నగరం అవుతుందని కామెంట్లు
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో మంచు కురవడం అత్యంత అరుదు.. రాష్ట్రం పేరు చెబితే మండే ఎండలు, ఇసుక ఎడారులే గుర్తుకు వస్తాయి. అలాంటి చోట మంచు కురిస్తే.. రోడ్లపై ఏకంగా అడుగు మందంలో పేరుకుపోతే.. చుట్టూ తెల్లని మంచు తప్ప మరేమీ కనిపించకుంటే.. జైపూర్ సిటీ ఎలా ఉంటుందనేది కృత్రిమే మేధ చూపించింది. మంచులో కూరుకుపోయిన జైపూర్ సిటీ ఇలా ఉంటుందని ఫొటోలు జెనరేట్ చేసిచ్చింది. జైపూర్ డ్రోనీ అనే యూజర్ ఈ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ ఫొటోలతో కూడిన వీడియోను లక్షలాదిగా షేర్ చేస్తున్నారు.

నిజంగా జైపూర్ ఇలా మంచులో కూరుకుపోతే దేశంలోనే అత్యంత సుందరమైన నగరంగా నిలుస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కశ్మీర్ కంటే జైపూర్ సిటీయే అందంగా ఉంటుందని మరొకరు, పర్యాటకులంతా కశ్మీర్, మనాలీకి వెళ్లకుండా జైపూర్ కే వస్తారని ఇంకొకరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మంచులో తడిసిముద్దవుతున్న జైపూర్ సిటీ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని మరికొందరు కామెంట్ చేశారు.



More Telugu News