నాకు కప్పుకంటే రవితేజ సినిమాలో ఛాన్స్ ముఖ్యం: 'బిగ్ బాస్' అమర్ దీప్
- బిగ్ బాస్ సీజన్ 7లో రన్నర్ గా నిలిచిన అమర్ దీప్
- శివాజీ మాటలు పట్టించుకోలేదని వెల్లడి
- హీరో రవితేజ గురించిన ప్రస్తావన
- ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని వివరణ
అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్స్ వరకూ చేరుకుని, రన్నర్ గా నిలిచిపోయాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోను. కానీ శివాజీ గారు 97 సినిమాలు చేసిన హీరో. అందువలన నేను ఆయనను గౌరవిస్తూ వెళ్లాను. నా అనుకున్నవాళ్లు నన్ను ఏమన్నా నేను పెద్దగా పట్టించుకోను" అన్నాడు.
నాగార్జునగారు విజేతను ప్రకటించే సమయంలో నా చేయిని క్రిందికి దించేసినప్పుడు నేను ఏమీ అనుకోలేదు. ఎందుకంటే నేను గెలిచాను. రవితేజ గారి సినిమాలో ఛాన్స్ కొట్టాను ... అంతకంటే నాకు ఏం కావాలి? కప్పు కళ్లముందు పెట్టి .. నీకు కప్పుకావాలా? రవితేజ సినిమాలో ఛాన్స్ కావాలా? అంటే, రవితేజ సినిమా అనే చెబుతాను" అని అన్నాడు.
రవితేజ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. జనాలు కూడా నన్ను ఆయన పక్కన చూడాలనే కోరుకున్నారు. అందువలన నేను హౌస్ లో నుంచి బయటికి రావడానికి వెనుకాడలేదు. నేను గేమ్ ఆడేటప్పుడు ఒక్కోసారి చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయం మరిచిపోయేవాడిని. అందువలన ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు.