రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దానకిశోర్, ఆమ్రపాలి
- సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అధికారులు
- అధికారంలోకి వచ్చాక అధికారుల బదిలీలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
- హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు
ఐఏఎస్ అధికారులు దానకిశోర్, ఆమ్రపాలి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్‌గా దానకిశోర్‌ను, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. అయితే నిన్న అధికారుల బదిలీల క్రమంలో దానకిశోర్‌ను ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సచివాలయంలో వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో గత శుక్రవారం ఆమ్రపాలి హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఆమె బాధ్యతలు స్వీకరించారు.