సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ పై వర్మ స్పందన
- బానిసలుగా మారకండి అంటూ పోస్టు చేసిన వీవీ లక్ష్మీనారాయణ
- రెండు లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి అంటూ వర్మ ట్వీట్
- అజ్ఞానులైన అభిమానులు అతడిని మహా జ్ఞాని అనుకుంటారని వ్యాఖ్యలు
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. బానిసలుగా మారకండి అంటూ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
"కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా? ఆ రెండు లక్షల పుస్తకాల నుంచి అతడు ఏం నేర్చుకోలేదో, అంతకు మించి అతడు ఆలోచించలేడని అర్థమవుతోంది. కానీ అజ్ఞానులైన అభిమానులందరూ అతడొక మహా జ్ఞాని అని నమ్ముతారు. కానీ వాళ్లందరూ తనను జ్ఞాని అని ఎందుకు అనుకుంటున్నారో అని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా అతడికి లేదు... ఎందుకంటే అతడు నికార్సయిన అజ్ఞాని కాబట్టి" అంటూ వర్మ పేర్కొన్నారు.