సుప్రీంకోర్టులో సినీనటి జయప్రదకు ఊరట

  • థియేటర్ కార్మికుల ఈఎస్ఐ బకాయిల కేసు
  • జయప్రదకు 6 నెలల జైలు శిక్షను విధించిన ట్రయల్ కోర్టు
  • జైలు శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు
సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు చెన్నై ఎగ్మోర్ లోని ట్రయల్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. చెన్నైలో జయప్రద ఒక సినిమా థియేటర్ ను నిర్వహించారు. థియేటర్ కు నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు. అయితే, తమకు సంబంధించిన ఈఎస్ఐ బకాయిలు చెల్లించలేదంటూ థియేటర్ కార్మికులు ఎగ్మోర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో జయప్రదకు ట్రయల్ కోర్టు శిక్షను విధించింది. దీంతో, ట్రయల్ కోర్టు తీర్పును జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయప్రద పిటిషన్ పై తదుపరి విచారణ ముగిసేంత వరకు శిక్షపై స్టే విధిస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News