తమిళనాడులో రాత్రంతా కుమ్మేసిన వర్షం, నాలుగు జిల్లాలు అతలాకుతలం.. స్కూళ్ల మూసివేత, పదుల సంఖ్యలో రైళ్ల రద్దు
- నిన్న పొద్దుపోయాక మొదలై ఈ తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం
- కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తేన్‌కాశి జిల్లాలు అతలాకుతలం
- ప్రభావిత జిల్లాలకు మంత్రులను పంపిన ప్రభుత్వం
- సహాయక చర్యలు ప్రారంభం
కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము వరకు అలుపన్నదే లేకుండా కురిసింది. ఫలితంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తేన్‌కాశి జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఉందని, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకు విస్తరించి ఉందని వాతావరణ విభాగం తెలిపింది.