అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు
- డెలావేర్‌లోని క్యాంపెయిన్ ఆఫీసును అధ్యక్షుడు సందర్శించిన సమయంలో ఘటన
- బైడెన్ కారుకు కొద్ది దూరంలో నిలిపి ఉంచిన కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టిన కారు
- వెంటనే బైడన్‌ను అక్కడి నుంచి తరలించిన సిబ్బంది
- అధ్యక్షుడు, ఆయన అర్థాంగి సురక్షితమంటూ వైట్ హౌస్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లోని కారును మరో కారు ఢీకొట్టిన ఘటన కలకలానికి దారి తీసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం డెలావేర్‌లోని తన క్యాంపెయిన్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడి భద్రత నిమిత్తం కార్యాలయానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ కారును మరో కారు ఢీకొట్టింది. బైడెన్ తిరుగుప్రయాణమయ్యేందుకు కార్యాలయం నుంచి బయటకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు అధ్యక్షుడిని వడివడిగా అక్కడి నుంచి తరలించారు. బైడెన్, ఆయన భార్య సురక్షితంగా ఉన్నట్టు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.