తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్
- అర్ధరాత్రి బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళ
- బైక్ మీద దింపుతామని తీసుకెళ్లి అత్యాచారం
- ఈ నెల 7న జరిగిన దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి
హైదరాబాద్ లో అర్ధరాత్రి సమయంలో బస్ కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. చంపేస్తామని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. భయంతో ఎవరికీ చెప్పుకోలేక సతమతమైన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు..
నగరంలోని తార్నాకలో ఈ నెల 7న ఓ మహిళ బస్ స్టాపులో వేచి ఉంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను చూసి బైక్ పై అటుగా వెళుతున్న బర్న యేసు (32) ఆగాడు. ఆమె పరిస్థితి తెలుసుకుని బైక్ పై దింపుతానని ఎక్కించుకున్నాడు. లాలాపేట వరకు తీసుకెళతానని చెప్పిన యేసు.. ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి పిలిచి, వారితో కలిసి బాధితురాలిపై అఘాయిత్యం చేశాడు.
ఆపై ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించి, తార్నాకలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన బాధితురాలు తొలుత మౌనంగా ఉన్నా చివరికి లాలాగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తార్నాక బస్ స్టాప్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో బర్న యేసుతో పాటు మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్(19) లను అదుపులోకి తీసుకున్నారు.