చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై వివరాలు తెలిపిన నాదెండ్ల మనోహర్
- హైదరాబాదులో పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
- మీడియా ఎదుటకు వచ్చిన నాదెండ్ల మనోహర్
- ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చించారని వెల్లడి
- మిగతా విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని వివరణ
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులో జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు వివిధ అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు నాదెండ్ల వివరించారు.
"ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగింది. పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. భవిష్యత్తులోనూ రెండు పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళతాయి. మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తాం" అని నాదెండ్ల పేర్కొన్నారు.