సూట్ కేసుతో లోపలికి వెళ్లి యావర్ ను బయటికి తీసుకువచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్
- బిగ్ బాస్-7 గ్రాండ్ ఫినాలే
- బిగ్ బాస్ వేదికపై నా సామిరంగ టీమ్ సందడి
- అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లకు టాస్క్ ఇచ్చిన నాగార్జున
- రూ.15 లక్షల ఆఫర్ కు ఓకే చెప్పిన యావర్
బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలేలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రూ.15 లక్షల సూట్ కేసుకు యావర్ ఓకే చెప్పాడు.
బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున కొత్త చిత్రం నా సామిరంగ టీమ్ కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది. ఈ చిత్రంలో నాగ్ తో పాటు కీలక పాత్రలు పోషించిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, హీరోయిన్ ఆషికా రంగనాథ్, దర్శకుడు విజయ్ బిన్నీ కూడా వేదికపై వచ్చి అలరించారు.
కాగా, నా సామిరంగ చిత్రంలో అంజి, భాస్కర్ పాత్రలు పోషించిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లకు ఓ టాస్క్ అప్పగించారు. వారికి ఓ గోల్డెన్ సూట్ కేసు ఇచ్చి బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. ఆ సూట్ కేసులో రూ.15 లక్షలు ఉన్నాయని వెల్లడించారు.
ఆ సూట్ కేసుతో హౌస్ లోకి ప్రవేశించిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ తొలుత అమర్ దీప్ చౌదరిని సూట్ కేసు తీసుకుని బయటికి వచ్చేసారా అని అడిగారు. అందుకు అమర్ దీప్ స్పందిస్తూ, తనకు రవితేజ సినిమాలో చాన్స్ వచ్చిందని, ఇక తనకు డబ్బు అక్కర్లేదని తెగేసి చెప్పాడు. శివాజీ కూడా సూట్ కేసు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
ఆ తర్వాత యావర్ కొంచెం ఆలోచనలో పడగా... కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నాగార్జున అవకాశం ఇచ్చారు. యావర్ కుటుంబ సభ్యులు కూడా సూట్ కేసు తీసుకోవాలని ప్రోత్సహించారు. దాంతో, సూట్ కేసులోని రూ.15 లక్షలు తీసుకునేందుకు యావర్ అంగీకరించాడు. అతడిని అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఇంట్లోంచి బయటికి తీసుకువచ్చారు.
అంతకుముందు, ప్రియాంక జైన్ కూడా బిగ్ బాస్ ఫినాలే నుంచి సెకండ్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయింది. ఇప్పుడు యావర్ కూడా బయటికి వచ్చేయడంతో హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి మాత్రమే మిగిలారు. ఇవాళ మొదట అంబటి అర్జున్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తన 'ఈగల్' సినిమా కోసం మాస్ మహారాజా రవితేజ కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.