వ్యక్తిగత కారణాలతో టీమిండియా నుంచి వైదొలగిన ఇషాన్ కిషన్... కేఎస్ భరత్ కు స్థానం

  • దక్షిణాఫ్రికాలో డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్
  • తనను జట్టు నుంచి తప్పించాలని కోరిన ఇషాన్ కిషన్
  • కిషన్ అభ్యర్థనను మన్నించిన బీసీసీఐ
  • ఇషాన్ కిషన్ స్థానాన్ని కేఎస్ భరత్ తో భర్తీ
దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలిగాడు. తనను జట్టు నుంచి తప్పించాలన్న ఇషాన్ కిషన్ అభ్యర్థనను బీసీసీఐ మన్నించింది. అతడి స్థానంలో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

టెస్టు జట్టులో ఇప్పటికే కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ ఉన్నాడు. కేఎస్ భరత్ కూడా రెండో వికెట్ కీపర్ గా జట్టులో కొనసాగనున్నాడు. కేఎస్ భరత్ ఇప్పటివరకు 5 టెస్టులాడి 129 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ డిసెంబరు 26న ప్రారంభం కానుంది. 

టీమిండియా టెస్టు జట్టు ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.


More Telugu News