కువైట్ కొత్త ఎమిర్‌గా క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్
- ప్రకటించిన కువైట్ కేబినెట్
- 16వ అమిర్ షేక్ నవాజ్ మరణించడంతో నిర్ణయం
- ఈ మేరకు ప్రకటన చేసిన కువైట్ ఉప ప్రధాని ఇస్సా అల్ కందారీ
కువైట్ కొత్త ఎమిర్‌గా క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ పేరుని ఆ దేశ కేబినెట్ ప్రకటించింది. కువైట్ 16వ ఎమిర్, 82 ఏళ్ల షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ ఈ శనివారం కన్నుమూశారు. దీంతో ఆయన స్థానంలో షేక్ మిషాల్ సింహాసనాన్ని అధిష్టించారు. ఈ మేరకు కువైట్ ఉప ప్రధాని, క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి ఇస్సా అల్-కందారీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం, 1964 నాలుగవ చట్టంలోని ఆర్టికల్ 4ను అనుసరించి ఈ ప్రకటన చేస్తున్నామని తెలిపారు. కాగా షేక్ నవాఫ్ స్మారకార్థం 40 రోజుల సంతాప దినాలను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కువైట్ అధికారిక టీవీ అల్-కందారి తెలిపింది.