రతన్ టాటాకు బెదిరింపులు.. భద్రత పెంచకపోతే సైరస్ మిస్త్రీ మాదిరిగానే అవుతుందని హెచ్చరిక
- పారిశ్రామిక దిగ్గజానికి పూణే వ్యక్తి బెదిరింపులు
- కర్ణాటక నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన నిందితుడు
- వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. టాటా ప్రాణాలకు ముప్పు పొంచివుందని, భద్రత పెంచకుంటే సైరస్ మిస్త్రీ మాదిరిగానే జరుగుతుందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. నిందిత వ్యక్తి పూణేకు చెందినవాడని ముంబై పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఫోన్ చేశాడని దర్యాప్తులో తేల్చారు. కాగా నిందితుడు కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బెదిరింపు కాల్ అయినన్పటికీ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. రతన్ టాటా నివాసం వద్ద వెంటనే తనిఖీలు చేపట్టి భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ గతేడాది సెప్టెంబరులో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కారులో అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.