ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు చేసుకున్నారంటూ మండిపడుతున్న వైసీపీ
- జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాగబాబు
- ఇటీవల తెలంగాణలో నాగబాబు ఓటేశారన్న వైసీపీ
- ఏపీలో ఎలా ఓటు హక్కు పొందుతారంటూ ఆగ్రహం
జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుపై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన నాగబాబు... ఏపీలోనూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించింది. ఆంధ్రాలో ఓటు కోసం తన పేరును కె.నాగేంద్రరావుగా మార్చి తప్పుడు దరఖాస్తు చేశారని వెల్లడించింది. ఎప్పుడూ నీతులు వల్లించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడి దొంగ ఓటు నమోదుపై కనీసం నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. నాగబాబు దరఖాస్తుపై పరిశీలన చేపట్టిన బీఎల్వో... దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్టు సమాచారం.