రేవంత్ రెడ్డి రేపు ఎక్కడ ఉంటారో..!: హరీశ్ రావు సెటైర్లు
- తమకు పార్టీ మారిన చరిత్ర లేదని రేవంత్ రెడ్డిపై విమర్శలు
- తాము పదవుల కోసం పాకులాడటం లేదన్న హరీశ్ రావు
- బురదజల్లడం మానుకొని పరిపాలనపై దృష్టి సారించాలని హరీశ్ రావు హితవు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఆయనలా తమకు పార్టీ మారిన చరిత్ర లేదని, పదవులను గడ్డిపోచలా త్యజించిన చరిత్ర తమ బీఆర్ఎస్‌ది అన్నారు. హరీశ్ రావు శాసనసభలో మాట్లాడుతూ... పదవులను గడ్డి పోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్ కు, తమ పార్టీకే ఉందని అన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉందని, తాము పదవుల కోసం పాకులాడటం లేదన్నారు.
రేవంత్ రెడ్డి రేపు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ ద్వారా వచ్చి, ఆ తర్వాత తమ పార్టీలో పని చేసి, అనంతరం తెలుగుదేశంలోకి పోయాడని, చివరకు కాంగ్రెస్‌లో చేరిపోయాడన్నారు. ఇలాంటి వ్యక్తి రేపు ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి.. కానీ మాకు అలాంటిది లేదన్నారు.
బురద జల్లడం మానుకోండి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు... ఎమ్మెల్యే హరీశ్ రావుకు అడ్డుపడ్డారు. దీంతో హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. నీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను పో అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు తమ పార్టీయే పోరాడిందన్నారు. పేగులు తెగేదాకా కొట్లాడిందేవరు... పెదవులు మూసుకున్నదేవరో రాష్ట్ర ప్రజలకు గుర్తుందన్నారు. దయచేసి తమ బీఆర్ఎస్ మీద విమర్శలు మాని... మీకు అధికారం ఇచ్చిన ప్రజలకు ఏం చేయాలి? ఇచ్చిన గ్యారెంటీలను ఎలా అమలు చేయాలి? అనే విషయమై ఆలోచించాలని సూచించారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇస్తున్నామని, కానీ నెపాలు పెట్టి, బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. పరిపాలన మీద దృష్టి పెట్టాలన్నారు.