"ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా" అనడం సరికాదు: కూనంనేని

  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే 2 హామీలు నెరవేర్చిందని ప్రశంస
  • కేంద్రం నుంచి రాష్ట్రాలనికి నిధులు రావాల్సి ఉందని వెల్లడి
  • హామీలు నెరవేర్చేందుకు డబ్బులు ఇబ్బంది కాదని వ్యాఖ్య
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. శనివారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ... నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలని ప్రశంసించారు. అప్పుడు జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. హామీలను నెరవేర్చడానికి డబ్బులు ఇబ్బంది కాదని గుర్తించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చారని కితాబిచ్చారు. అయితే ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలన్నారు.

అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 2020లో పదిహేడు రోజులు, 2023లో పదకొండు రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా చర్చ జరగాలన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని విపక్షాలు అనడం సరికాదన్నారు. 

పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిందన్నారు. ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందని కూనంనేని ఆరోపించారు.


More Telugu News