కీలక శాఖలలో ఫైళ్ల ధ్వంసం, గల్లంతును తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం

  • ఫైళ్ల నిర్వహణపై ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు విధివిధానాలను జారీ చేసిన ప్రభుత్వం
  • శాఖల వారీగా ఫైళ్ల వివరాలను నమోదు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాల జారీ
  • ఫైళ్లు మాయమైతే సంబంధిత అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు
  • ఫైళ్ల నిర్వహణపై ఈ నెల 18వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు
ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని శాఖలలో ఫైళ్ల గల్లంతు లేదా ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫైళ్ల గల్లంతు, ధ్వంసం ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఫైళ్ల నిర్వహణపై ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు విధివిధానాలను జారీ చేసింది. శాఖల వారీగా ఫైళ్ల వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్లు మాయమైతే సంబంధిత అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్ల నిర్వహణపై ఈ నెల 18వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News