ఈ దేశానికి కూడా భారతీయులు వీసా లేకుండానే వెళ్లొచ్చు!
- భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్
- భారత్ సహా 33 దేశాల ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ
- గతంలో 12 దేశాలకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్
- పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం
భారతీయులకు అనేక దేశాలు వీసా లేకుండానే తమ దేశంలో ప్రవేశించేందుకు అనుమతిస్తుండడం తెలిసిందే. ఇప్పుడీ దేశాల జాబితాలో ఇరాన్ కూడా చేరింది. ఇక మీదట వీసా లేకుండానే భారతీయులు ఇరాన్ వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.
ఇరాన్ ఇస్లామిక్ ప్రాబల్యం దేశం అన్న విషయం తెలిసిందే. అయితే, అరబ్ దేశాలకు భిన్నంగా ఇరాన్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అంతరిక్ష పరిశోధనల రంగంలో ఇరాన్ ఇటీవల సాధించిన విజయాలు అందుకు నిదర్శనం. అంతేకాదు, ఇరాన్ తయారీ డ్రోన్లు వివిధ యుద్ధ రంగాల్లో సత్తా చాటుతున్నాయి.
కొంత ఛాందసవాద పోకడలు ఉన్నప్పటికీ, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్నది అందులో ముఖ్యమైనది.
అందుకే, పర్యాటకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఇరాన్ పలు మిత్ర దేశాల ప్రజలకు వీసా మినహాయింపులు ఇస్తోంది. తాజా ప్రకటనలో భారత్ సహా 33 దేశాలకు చెందిన వారు తమ దేశంలో వీసా లేకుండానే అడుగుపెట్టవచ్చని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ గతంలో ఈ వీసా మినహాయింపును 12 దేశాలకు వర్తింపజేయగా, ఇప్పుడా సంఖ్య 45కి పెరిగింది.