ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు అందించిన రిజిస్ట్రార్

  • తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు ఉన్నట్లు తెలిపిన రిజిస్ట్రార్
  • 20 కేసులు సీబీఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో ఉన్నట్లు వెల్లడి
  • అన్ని కేసులపై మూడు నెలల్లో పూర్తి వివరాలతో మరోసారి నివేదిక అందించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను తెలంగాణ హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదికను శుక్రవారం అందించింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఇరవై కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, మరో 46 కేసులు ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేసే దశలో ఉన్నాయని వెల్లడించింది. 10 కేసులలో ప్రజాప్రతినిధుల కేసులపై స్టే ఉన్నట్లు తెలిపింది.

అయితే తన వద్ద ఉన్న కేసులను శుక్రవారం నుంచి రెండు నెలల లోపు పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ దశలో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొంది. ఐదు కేసులకు సంబంధించి వెంటనే ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్ నెంబర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులపై మూడు నెలల్లో పూర్తి వివరాలతో మరో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.


More Telugu News