క్యాన్సర్ బాధిత బాలుడి కోరిక నెరవేర్చిన బంజారాహిల్స్ పోలీసులు
- ఏడాదిగా బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
- పోలీస్ అధికారి కావాలనే బాలుడి కోరికను గుర్తించిన డాక్టర్లు
- మేక్ ఏ ఫౌండేషన్‌ను సంప్రదించిన వైద్యులు
పోలీస్ అధికారి కావాలనే ఓ క్యాన్సర్ బాధిత బాలుడి కోరికను బంజారాహిల్స్ పోలీసులు నెరవేర్చారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా... పోలీసులు ఆ బాలుడిని సంతోషపెట్టారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. నాటి నుంచి హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి పోలీస్ అధికారి కావాలనే కోరిక ఉందని గుర్తించిన డాక్టర్లు... మేక్ ఎ విష్ ఫౌండేషన్‌ను సంప్రదించారు. వారు బంజారాహిల్స్ పోలీసులను సంప్రదించారు. ఆ చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. పోలీసులు ఆ చిన్నారిని సాదరంగా ఆహ్వానించి... అధికారిక స్థానంలో కూర్చోబెట్టారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ జాకీర్ హుస్సేన్ ఆ బాలుడికి గౌరవ వందనం చేశారు. ఆ బాలుడి నుంచీ గౌరవ వందనం స్వీకరించారు.