వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 967 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 274 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఐదున్నర శాతానికి పైగా లాభపడ్డ హెచ్సీఎల్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 967 పాయింట్లు లాభపడి 71,484కి ఎగబాకింది. నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 21,457కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (5.58%), టీసీఎస్ (5.28%), ఇన్ఫోసిస్ (5.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.99%), టాటా స్టీల్ (3.33%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.75%), భారతి ఎయిర్ టెల్ (-1.30%), మారుతి (-0.65%), ఐటీసీ (-0.40%), కోటక్ బ్యాంక్ (-0.18%).


More Telugu News