7 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన దీప్తి... ఏకైక టెస్టులో ఇంగ్లండ్ ను కుప్పకూల్చిన భారత మహిళల జట్టు
- నవీ ముంబయిలో భారత్, ఇంగ్లండ్ మహిళల ఏకైక టెస్టు మ్యాచ్
- తొలి ఇన్నింగ్స్ లో భారత్ 428 ఆలౌట్
- ఇంగ్లండ్ ను 136 పరుగులకు కుప్పకూల్చిన భారత బౌలర్లు
- పార్ట్ టైమ్ బౌలర్ దీప్తి శర్మ సంచలన బౌలింగ్ ప్రదర్శన
- రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 83 పరుగులు చేసిన భారత్
సొంతగడ్డపై ఇంగ్లండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఒక్కరోజులోనే 400కి పైగా పరుగులు చేసిన భారత్... రెండో రోజు ఆటలో 428 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ను పార్ట్ టైమ్ స్పిన్నర్ దీప్తి శర్మ హడలెత్తించింది.
దీప్తి కేవలం 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను చావుదెబ్బ కొట్టింది. దీప్తి శర్మ 5.3 ఓవర్లు బౌలింగ్ చేయగా, అందులో 4 ఓవర్లు మెయిడెన్ కావడం విశేషం. దాంతో ఇంగ్లండ్ జట్టు 35.3 ఓవర్లలో 136 పరుగులకు కుప్పకూలింది.
ఇంగ్లండ్ జట్టులో నాట్ షివర్ బ్రంట్ (59) అర్ధసెంచరీ చేసింది. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, రేణుకా సింగ్ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ తీశారు. భారత్ కు 292 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత మహిళల జట్టు 18 ఓవర్లలో 3 వికెట్లకు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు ఆధిక్యం 375 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్ నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతోంది.