‘ప్రజావాణి’కి పోటెత్తిన ప్రజలు.. ప్రజాభవన్ ముందు బారులు

  • ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం
  • తమ కష్టాలు చెప్పుకుని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు
  • కిలోమీటర్ మేర అర్జీదారుల బారులు
తెలంగాణలో  కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకుని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌కు నేడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఏర్పడింది.

గతంలో ప్రజాదర్బార్‌గా ఉన్న పేరును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్ల నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరగనున్నా.. 10 గంటల వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌కు చేరుకున్నారు.


More Telugu News