‘ఇది కదన్నా తెలంగాణలో మన చరిత్ర’.. సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు సెటైర్లు
- 2014 ఎన్నికల్లో కొల్లాపూర్‌లో వైసీపీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయని కౌంటర్
- ఎదుటివారి వైపు వేలు చూపించడం ఎందుకంటూ విమర్శలు
- 2014 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని వ్యంగ్యాస్త్రాలు సంధించిన టీడీపీ సీనియర్ నేత
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తుండడంపై టీడీపీ, జనసేన శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. దివంగత నేత ముద్దు బిడ్డవి కదా ఆనాడు కొల్లాపూర్‌లో అభ్యర్థిని నిలిపితే 1204 (0.81%) ఓట్లు మాత్రమే వచ్చాయేంటని సీఎం జగన్‌ని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. 2023లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు 5,754 (2.99%) అని, ఎదుటివారి వైపు వేలు చూపించడం ఎందుకని కౌంటర్ ఇచ్చారు. ‘ఇది కదన్న తెలంగాణలో మన చరిత్ర. గురివింద గింజ మాటలు చెప్పడం ఇప్పటికైనా మానుకోండన్న జనాలు నవ్వుతుండ్రు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బంగాళదుంపకు ఉల్లిగడ్డకు తేడా తెలియని జగనన్న డిపాజిట్లు అంటే ఇవేనా అని గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీచేస్తే తమరికొచ్చిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయనే సంగతి మరచిపోయారా? అని అడిగారు. ఆనాడు తెలంగాణలో రాళ్లతో తరిమి తరిమి కొట్టిన రోజులు మరచిపోయావా అంటూ ప్రస్తావించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. 2014లో తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల డేటాను ఆయన షేర్ చేశారు.