కోలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు శంకరన్ మృతి
- చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన శంకరన్
- ఆయన వయసు 93 సంవత్సరాలు
- 1962లో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శంకరన్
తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్.శంకరన్ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఈయన శిష్యుడే. తన గురువు మృతి పట్ల భారతీరాజా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా శంకరన్ సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. 1999లో చివరిసారిగా 'అళగర్ సామి' చిత్రంలో నటించారు. 1974లో 'ఒన్నే ఒన్ను కన్నె కన్ను' చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.