సూర్యకుమార్ యాదవ్‌ని ఎలా ఆపాలి?.. మాజీ పేసర్ జహీర్ ఖాన్ చెప్పిన సమాధానం ఇదే!
- ఔట్ చేయడం ఒక్కటే సూర్యని ఆపే మార్గమన్న మాజీ దిగ్గజం
- సూర్య లాంటి బ్యాటర్లు క్రీజులో ఉంటే బౌలర్లకు కష్టతరమని వ్యాఖ్య
- మైదానం నలువైపులా షాట్లు కొట్టగలని ‘మిస్టర్ 360‘పై ప్రశంసలు
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. మైదానం నలువైపులా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సూర్యను కట్టడి చేయడానికి సౌతాఫ్రికా బౌలర్లు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు సెంచరీ పూర్తయ్యాక ఔట్ చేయగలిగారు. మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎదురైన పరిస్థితిపై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఆసక్తికరంగా స్పందించాడు.
సూర్య రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు ఔట్ చేయడం ఒక్కటే అతడిని ఆపగలిగే మార్గమని, అదొక్కటే అవకాశమని బౌలర్లకు జహీర్ సూచించాడు. బౌలర్లు అత్యుత్తమ బంతులు సంధించి సూర్యని ఔట్ చేయాలని అన్నాడు. దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో చివరికి అదే జరిగిందని అన్నాడు.
సూర్య బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నాడని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని జహీర్ ఖాన్ అన్నాడు. ‘మిస్టర్ 360’ మైదానం నలువైపులా షాట్లు కొట్టగల సమర్థుడని, బౌలర్లకు ఇది చాలా కష్టతరమని అన్నాడు. ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి కాబట్టి బౌలర్లకు ఎప్పుడూ కష్టమేనని అన్నాడు. సూర్య లాంటి బ్యాటర్ క్రీజులో ఉన్నప్పుడు బంతిని లాంగ్ ఆన్, మిడ్ వికెట్, కవర్ మీదుగా సిక్స్‌లు కొట్టగలరని, ఇది బౌలర్‌లకు కఠినమైనదని పేర్కొన్నాడు. సూర్య షాట్లు కొట్టేందుకు ప్లేసులు ఎంచుకుంటాడని, ఒకసారి ఊపు అందుకుంటే బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడం అంత సులభం కాదని అన్నాడు. ఈ మేరకు జహీర్ ఖాన్ ‘క్రిక్‌బజ్’తో మాట్లాడాడు.