​జగన్ పాలనలో మొదటి బాధితులు వీళ్లే: నారా లోకేశ్

  • అనకాపల్లి జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర
  • యలమంచిలిలో యువగళానికి విశేష స్పందన
  • రిటైర్డ్ ఉద్యోగులతో నారా లోకేశ్ సమావేశం
  • గవరలతో ముఖాముఖి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో హోరెత్తింది. 222వ రోజు యువగళం పాదయాత్ర కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ వద్ద క్యాంప్ సైట్ నుంచి కోలాహలంగా ప్రారంభమైంది. 

యలమంచిలి శివార్లలో అంగన్ వాడీ వర్కర్లు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించగా, వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. యలమంచిలి శివార్లలో ఇటీవల మిగ్జామ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను లోకేశ్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను యలమంచిలి ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్ చార్జి సుందరపు విజయకుమార్ యువనేతకు తెలియజేశారు.

1వ తేదీనే పెన్షన్ ఇస్తాం: లోకేశ్

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యలమంచిలి రామాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ పాలనలో ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే దిక్కు లేదని విమర్శించారు. ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. 

టీడీపీ హయాంలో 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే జగన్ రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులను ముంచేశాడు. జగన్ పాలనలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగులే, ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగస్తులను రోడ్డున పడేశాడు. విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

2014లో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఉద్యోగస్తులకు చంద్రబాబు ఎటువంటి లోటు లేకుండా చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగస్తులపై తప్పు చేస్తున్నారు అనే ముద్ర వేస్తున్నారు" అని వివరించారు.

మెరుగైన ఫిట్ మెంట్ ఇస్తాం

జగన్ పాలనలో రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లకు చేరింది. ఏడాదికి లక్ష కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. రాబోయే 25 ఏళ్ల మద్యం ఆదాయం చూపించి పై అప్పు తెచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి మెరుగైన ఫిట్మెంట్ ఇస్తాం. 

జీవో నెం.79 తెచ్చి పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్స్ కూడా రద్దు చేశాడు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో నెం.79 రద్దు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం మెరుగైన హౌసింగ్ స్కీం తీసుకొస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు నాణ్యమైన ఇళ్లు కట్టిస్తాం. జగన్ ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని అనారోగ్య శ్రీ గా మార్చేశాడు.

అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అమలు చేస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందిస్తాం. మెరుగైన హెల్త్ స్కీం తీసుకొస్తాం. జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం చేసేది లేదని చెబుతున్నాయి. 

మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెడికల్ బిల్లులు రీయింబర్స్ మెంట్ చేస్తాం. రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశాల కోసం భవనాలు ఏర్పాటు చేస్తాం. గతంలో టీడీపీ హయాంలో ఇచ్చిన మాదిరిగా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అమలు చేస్తాం. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు అవుతున్న మంచి హెల్త్ స్కీంలు స్టడీ చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెరుగైన హెల్త్ స్కీం తీసుకొస్తాం. 

గవరలతో ముఖాముఖి సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యలు...

గవరలను వేధించిన వారిని వదిలిపెట్టను

బెల్లం వ్యాపారం చేసే గవరలను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది, జగన్ ప్రభుత్వం గవర సామాజికవర్గానికి చిల్లి గవ్వ ఇవ్వలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర కార్పొరేషన్ బలోపేతం చేస్తాం, గవరలకి పూర్వ వైభవం తీసుకొస్తాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర కార్పొరేషన్ బలోపేతం చేస్తాం. టీడీపీ హయాంలో గవర సామాజికవర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. జగన్ ప్రభుత్వం గవర కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది. 

గవరలకు అనేక ఉన్నతమైన పదవులు ఇచ్చింది టీడీపీనే. గవర అనగానే నాకు గుర్తొచ్చేది గౌరవం. కష్టపడే తత్వం ఉన్న వారు గవర సోదరులు. వ్యవసాయం, బెల్లం వ్యాపారం పై ఆధారపడిన వారు గవరలు. గవర సోదరులను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. బీసీలపై చెయ్యి వేసిన వారికి తగిన శిక్ష పడేలా నేను చూస్తాను.

వ్యవసాయ సబ్సిడీలను ఎత్తేసిన జగన్


టీడీపీ హయాంలో వ్యవసాయానికి అనేక సబ్సిడీలు అందించాం. సబ్సిడీలో యంత్రాలు అందించాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు ఎత్తేసింది. విత్తనాలు, ఎరువులు, పరికరాల రేటు విపరీతంగా పెరిగిపోయాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో మాదిరిగా వ్యవసాయానికి సాయం అందిస్తాం. గతంలో టీడీపీ ప్రభుత్వం నల్లబెల్లంపై నిషేధం ఎత్తివేఇసంది. ఇప్పుడు నల్ల బెల్లం రైతులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం కి.మీ. 3074 కి.మీ.*

*223వరోజు (15-12-2023) యువగళం వివరాలు*

*యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – గొర్లె ధర్మవరంలో కాపు సామాజికవర్గీయులతో సమావేశం.

10.00 – పూడి గ్రామంలో స్థానికులతో సమావేశం.

10.45 – వెదురువాడలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

11.00 – వెదురువాడలో నావల్ బేస్ బాధిత మత్స్యకారులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.00 – వెదురువాడలో భోజన విరామం.

2.00 – వెదురువాడలో కొప్పుల వెలమ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – వెదురువాడ నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – అచ్యుతాపురంలో మత్స్యకారులతో భేటీ.

4.35 – మోసయ్యపేట జడ్ పిహెచ్ ఎస్ స్కూలు వద్ద స్థానికులతో సమావేశం.

4.45 – మోసయ్యపేటలో స్థానికులతో మాటామంతీ.

5.00 – చోడపల్లిలో స్థానికులతో సమావేశం.

6.15 – కొండకర్ల జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

6.45 – హరిపాలెంలో స్థానికులతో సమావేశం.

రాత్రి

7.00 – కాజిపాలెం తిమ్మరాజుపేటలో దళితులతో సమావేశం.

7.20 – తిమ్మరాజుపేట డావిన్సీ స్కూలు వద్ద విడిది కేంద్రంలో బస.

******


More Telugu News