దక్షిణాఫ్రికాతో చివరి టీ20లో టాస్ ఓడిన టీమిండియా... ఈ మ్యాచ్ గెలిస్తేనే...!

  • దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20ల సిరీస్
  • తొలి మ్యాచ్ వర్షార్పణం... రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలుపు
  • నేటి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సఫారీల వశం
  • సిరీస్ సమం చేయాలని దృఢనిశ్చయంతో ఉన్న టీమిండియా 
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ లో నేడు చివరి టీ20కి టీమిండియా సిద్ధమైంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా నెగ్గింది. నేటి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ కోల్పోకుండా ఉంటుంది. అందుకే, సర్వశక్తులు ఒడ్డిపోరాడాలని సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు కృతనిశ్చయంతో ఉంది. 

ఈ మ్యాచ్ కు జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు.

ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో పలు మార్పులు జరిగాయి. సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ పునరాగమనం చేశాడు. ట్రిస్టాన్ స్టబ్స్ స్థానంలో డోనోవాన్ ఫెరీరాకు అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్ ద్వారా నాండ్రే బర్గర్ అరంగేట్రం చేస్తున్నాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ వెల్లడించాడు.


More Telugu News