ఆ భూములు హెచ్ఎండీఏకే చెందుతాయి: శంషాబాద్ పరిధిలోని 50 ఎకరాలపై తీర్పు వెల్లడించిన హైకోర్టు

  • సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం పిటిషన్లు
  • పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు
  • భూములన్నీ హెచ్ఎండీఏకు చెందుతాయని స్పష్టం చేసిన హైకోర్టు
హెచ్ఎండీఏ పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన భూకబ్జాదారులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. తప్పుడు రికార్డులు సృష్టించి, సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నిస్తూ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ భూములన్నీ హెచ్ఎండీఏకు చెందుతాయని స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ మెట్రోపాలటన్ కమిషనర్, హెచ్ఎండీఏ ఎస్టేట్, స్టేట్ లీగల్, ఎన్ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు భూరికార్డులను పరిశీలించి, ఏడాది కాలంగా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. వాద, ప్రతివాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును ఈ రోజు వెల్లడించింది. ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. 

కేసు విషయానికి వస్తే శంషాబాద్ లోని 181 ఎకరాల భూములను 1990లలో ట్రక్ టర్మినల్ ఏర్పాటు కోసం ల్యాండ్ అక్విజేషన్ కింద తీసుకుంది. ఈ భూములపై హెచ్ఎండీఏకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇక్కడి భూముల్లో ఇరవై ఎకరాల్లో హెచ్ఎండీఏ నర్సరీని నిర్వహిస్తోంది. రెండు ఎకరాలను వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం కేటాయించింది. అయితే 50 ఎకరాల భూమిని కొందరు కబ్జాకు ప్రయత్నించారు. ఇప్పుడు కోర్టు తీర్పు హెచ్ఎండీఏకు అనుకూలంగా వచ్చింది.


More Telugu News