ఆ ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం!: సీఎం రేవంత్ రెడ్డి
- పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపుపై రేవంత్ స్పందన
- రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో ఉపయోగకరంగా ఉండదన్న సీఎం
- కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం
ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నిర్మాణం చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపు, శాసన సభ, శాసన మండలి సమావేశాల నిర్వహణపై స్పందించారు. పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు ఉంటాయని, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలోనే శాసన సభ జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండనుందన్నారు. ప్రజా భవన్‌లో ఇంకో భవనం ఉందని.. అది ఇంకో మంత్రికి ఇస్తామన్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో ఉపయోగకరంగా ఉండదని.. మరో మార్గంలో మెట్రో ప్లాన్ చేస్తామన్నారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజా భవన్‌లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా ఉపయోగించుకుంటామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ పద్నాలుగు గంటలకు మించి ఇవ్వలేదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుందని, శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.