"ఒక్కరోజులో రూ.2.5 లక్షల సంపాదన" అంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పేరిట డీప్ ఫేక్ వీడియోలు
- క్వాంటమ్ ఏఐ టెక్నాలజీ తీసుకు వస్తున్నామంటూ మూర్తి పేరిట వీడియోలు
- ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడి
- సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు వైరల్
- ఆపై ఫేస్ బుక్ నుంచి వీడియోల తొలగింపు
డీప్ ఫేక్ వీడియోలతో ఇబ్బంది పడుతోంది అతివలే కాదు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటి వారు కూడా ఈ నయా టెక్నాలజీ బాధితులే. తాజాగా ఆయన పేరిట రెండు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొత్తగా 'క్వాంటమ్ ఏఐ' అనే టెక్ వేదికను తీసుకువస్తున్నామని, ఈ టెక్నాలజీని ఉపయోగించే వారు తమ మొదటి పని రోజున రూ.2.5 లక్షలు అందుకుంటారని నారాయణమూర్తి చెబుతున్నట్టు ఆ వీడియోల్లో ఉంది.
వాటిలో ఒక వీడియోలో... 'క్వాంటమ్ ఏఐ' ప్రాజెక్టు కోసం ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేయనున్నామని నారాయణమూర్తి చెప్పడం మరో వీడియోలో చూడొచ్చు.
"ఎలాన్ మస్క్ తో కలిసి మేం చేపడుతున్న కొత్త ప్రాజెక్టును మేం ఇవాళ పరిచయం చేస్తున్నాం. 'క్వాంటమ్ ఏఐ' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సాఫ్ట్ వేర్. ఈ టెక్నాలజీని మా బృందం, ఎలాన్ మస్క్ బృందం కలిసి అభివృద్ధి చేశాయి. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం 94 శాతం సక్సెస్ రేటు నమోదు చేసింది" అంటూ ఆ డీప్ ఫేక్ వీడియోలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వివరిస్తున్నట్టుగా ఉంది.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు బాగా వైరల్ కాగా, అనంతరం ఆ వీడియోలను తొలగించారు. అయితే, ఇవి డీప్ ఫేక్ వీడియోలు అని గుర్తించగలిగేలా... ఆ వీడియోల్లో నారాయణమూర్తి పెదాల కదలికలకు, ఆడియోకు పొంతన కుదరలేదు. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించడానికి ముఖ్యంగా లిప్ సింక్ అంశం ఎంతగానో ఉపయోగపడుతుంది.
వాస్తవానికి అది నారాయణమూర్తి జులై 7న బెంగళూరులో నిర్వహించిన మనీకంట్రోల్ సదస్సులో మాట్లాడిన వీడియో. దాన్ని డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి 'క్వాంటమ్ ఏఐ' సందేశంతో నింపేశారు.