హైదరాబాద్ ను వణికిస్తున్న చలిపులి... దారుణంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు

  • చల్లదనానికి తోడవుతున్న శీతల గాలులు
  • పటాన్ చెరులో 12.4 డిగ్రీలుగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత
  • మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతాయని అధికారుల హెచ్చరిక
హైదరాబాద్ నగరవాసులపై చలిపులి పంజా విసిరింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. నగర శివార్లలోని పటాన్ చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. చల్లదనానికి చలిగాలులు కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఉదయం 7 గంటల వరకు రోడ్లపై పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్రనగర్ లో 12.5 డిగ్రీలు, దుండిగల్ లో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


More Telugu News