తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ సీఎం

  • లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిన మోహన్ యాదవ్
  • నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లపై నిషేధం
  • ఈరోజు మోదీ, అమిత్ షా సమక్షంలో మోహన్ ప్రమాణస్వీకారం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మోహన్ యాదవ్ తొలిరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించారు. నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లపైనే నిషేధం విధించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తక్కువ శబ్దం ఉన్న లౌడ్ స్పీకర్లపై నిషేధం లేదని చెప్పారు. నిర్ణీతమైన డెసిబెల్స్ పరిధిలో ఉన్న స్పీకర్లపై నిషేధం ఉండదని తెలిపారు. 

ప్రధాని మోదీ సమక్షంలో ఈరోజు సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు.


More Telugu News