బర్త్ డే సందర్భంగా రజనీకాంత్ విగ్రహానికి క్షీరాభిషేకం.. వీడియో ఇదిగో
- నిన్న రజనీకాంత్ 73వ పుట్టిన రోజు
- విస్తృతంగా అభిమానుల సేవా కార్యక్రమాలు
- కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సెలబ్రేషన్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్న ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొందరు అభిమానులు మాత్రం రజనీకాంత్ కోసం కట్టిన గుడిలో ఆయన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలతో అభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
73వ పడిలోకి ప్రవేశించిన రజనీకి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
రజనీకాంత్ 12 డిసెంబర్ 1950లో జన్మించారు. తల్లిదండ్రులు జిజాబాయి-రామోజీరావు నలుగురు సంతానంలో ఈయన చిన్నవాడు. ఐదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. తొలుత లోడ్లు ఎత్తడం వంటి పనులు చేసి, ఆ తర్వాత బస్ కండక్టర్‌గా మారారు. ఆపై సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్‌గా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.