ఏపీలో మిగ్జామ్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
- నేడు, రేపు 2 రోజులపాటు ప్రభావిత జిల్లాల్లో అధికారుల బృందం పరిశీలన
- పంటలు, ఇతర ఆస్తుల నష్టం అంచనా వేయనున్న అధికారులు
- జిల్లాల అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించనున్న బృంద సభ్యులు
ఆంధప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు (బుధవారం), రేపు (గురువారం) కేంద్ర బృందం పర్యటించనుంది. ప్రభావిత జిల్లాల్లో నష్టపోయిన పంటలు, ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర బృందం బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనుంది.
బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారుల బృందం పరిశీలన చేయనుంది. పరిశీలనకు ముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌తో భేటీకానుంది. రెండు బృందాలుగా ఏర్పడి ప్రభావిత ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోనున్నారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు.