చావనైనా చస్తాను కానీ... నాకు ఇది కావాలి అంటూ పార్టీ వద్దకు వెళ్లను: శివరాజ్ సింగ్ చౌహాన్

  • మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ
  • అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు
  • అనూహ్య రీతిలో మోహన్ యాదవ్ ను సీఎంగా ప్రకటించిన బీజేపీ
  • నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ ప్రస్థానానికి తెర
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ ప్రస్థానం సాగించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఈసారి ఆ భాగ్యం దక్కలేదు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారం నిలబెట్టుకున్నప్పటికీ... బీజేపీ హైకమాండ్ మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దాంతో నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్థానానికి తెరపడింది. 

ఇవాళ చౌహాన్ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. అనంతరం పలువురు మహిళలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగాలకు లోనయ్యారు. చావనైనా చస్తాను కానీ...  నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగడానికి ఢిల్లీ వెళ్లను అని స్పష్టం చేశారు. అలాంటివి నాకు నచ్చవు అని ఉద్ఘాటించారు. 

ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత శివరాజ్ సింగ్ ఢిల్లీ వెళ్లడానికి బదులు చింద్వారా వెళ్లారు. చింద్వారా ప్రాంతంలో బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తన చర్య ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.


More Telugu News