టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ కు షాక్.. రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై

  • టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టు నిన్న వార్తలు
  • రాజీనామాను ఆమోదించలేదని ప్రకటించిన రాజ్ భవన్
  • పేపర్ లీకేజ్ అంశం తేలకుండా రాజీనామాను ఆమోదించలేనని గవర్నర్ చెప్పినట్టు సమాచారం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై షాకిచ్చారు. ఆయన రాజీనామాను ఆమె ఆమోదించలేదు. జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. రాజీనామాను ఆమోదించలేదని స్పష్టం చేసింది. గ్రూప్-1 క్వశ్చన్ పేపర్ లీకులకు బాధ్యులు ఎవరో తేల్చకుండా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేనని గవర్నర్ చెప్పినట్టు సమాచారం. 

మరోవైపు, టీఎస్ పీఎస్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కూడా సమీక్ష నిర్వహించనున్నారు. పేపర్ లీకేజీ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను అధికారులతో సమీక్షించనున్నారు. టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీక్ అంశం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.


More Telugu News