రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి నియామకం

  • ప్రస్తుతం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో ఎస్పీగా పని చేస్తున్న చక్రవర్తి
  • చక్రవర్తి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందన్న డీజీపీ కార్యాలయం
  • చక్రవర్తి స్థానంలో మరో అధికారిని నియమించుకోవాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ కు సూచన
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో చక్రవర్తి ఎస్పీగా పని చేస్తున్నారు. ఆయనను సీఎం తాత్కాలిక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని... తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చక్రవర్తి స్థానంలో మరో అధికారిని నియమించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ కు సూచించారు.


More Telugu News