ఖాళీగా ఉన్న కదులుతున్న రైల్లో మహిళపై అత్యాచారం!
- మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఘటన
- బాత్రూమ్ కోసం ఖాళీ రైలు ఎక్కిన మహిళను అనుసరించిన నిందితుడు
- రైలు బయలుదేరాక మహిళపై అత్యాచారం
- పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు, నిందితుడి అరెస్ట్
కదులుతున్న ఏసీ రైల్లో ఓ మహిళ అత్యాచారానికి గురైన ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. పకారియా, మైహార్ స్టేషన్‌ల మధ్య ఖాళీగా వెళుతున్న స్పెషల్ రైల్లోని కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు (30) ఊంఛేరాకు వెళ్లేందుకు కట్నీ స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలెక్కింది. నిందితుడు కమలేశ్ కుశ్వాహా (22) కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాడు. పకారియా స్టేషన్‌లో ఈ రైలు ఆగగా దానిపక్కనే ఖాళీగా ఉన్న మరో స్పెషల్ ట్రైన్ కూడా వచ్చి ఆగింది. ఈ క్రమంలో మహిళ బాత్రూమ్ కోసమని ప్రత్యేక రైల్లోకి వెళ్లింది. ఇది గమనించిన నిందితుడు కమలేశ్ కూడా ఆమెను అనుసరిస్తూ స్పెషల్ రైల్లోకి వెళ్లి తలుపులకు గొళ్లెం పెట్టేశాడు. ఆ తరువాత కదులుతున్న రైల్లోనే ఓ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆ తరువాత బాధితురాలు సత్నా స్టేషన్ వద్ద దిగి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు స్టేషన్ మాస్టర్ సాయంతో రైలును ఆ తరువాతి స్టేషన్‌లో ఆపేశారు. అయితే, నిందితుడు బోగీ లోపల నుంచి గడియపెట్టుకోవడంతో రైల్వే సిబ్బంది సాయంతో పోలీసులు బోగీ తలుపులు తెరిచి నిందితుడిని అరెస్టు చేశారు.