టీమిండియాతో టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన... మూడు కొత్త ముఖాలకు చోటు

  • జనవరిలో భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ జట్టు
  • టీమిండియాతో 5 టెస్టుల సిరీస్
  • 16 మందితో ఇంగ్లండ్ జట్టు ఎంపిక
  • ఇంగ్లండ్ సారథిగా బెన్ స్టోక్స్
వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్  జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టులు ఆడనున్నాయి. 2024 జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ టెస్టు సిరీస్ జరగనుంది. కాగా, ఈ టెస్టు సిరీస్ కోసం నేడు ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. 

16 మందితో కూడిన ఈ జట్టులో మూడు కొత్త ముఖాలకు కూడా చోటు కల్పించారు. పేస్ బౌలర్ గస్ ఆట్కిన్సన్, యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్  లే ఈ సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నారు. 

ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ గా మరోసారి బెన్ స్టోక్స్ కే బాధ్యతలు అప్పగించారు. జో రూట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాక, ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా స్టోక్స్ ను నియమించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ జట్టు సభ్యులు వీరే...

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్,  ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ ఉడ్, జేమ్స్ ఆండర్సన్, గస్ ఆట్కిన్సన్, టామ్ హార్ట్ లే, షోయబ్ బషీర్. 

టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్...

తొలి టెస్టు- జనవరి 25 నుంచి 29 వరకు (హైదరాబాద్)
రెండో టెస్టు- ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు (విశాఖపట్నం)
మూడో టెస్టు- ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు (రాజ్ కోట్)
నాలుగో టెస్టు- ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు (రాంచీ)
ఐదో టెస్టు- మార్చి 7 నుంచి 11 వరకు (ధర్మశాల)


More Telugu News