ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రమంత్రి స్పందన!

  • కేంద్ర ఆర్థిక సహాయమంత్రిని ప్రశ్నించిన వైసీపీ, టీడీపీ ఎంపీలు 
  • దాటవేత ధోరణిని అవలంబించిన పంకజ్ చౌదరి
  • గత అయిదేళ్లలో ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వలేదని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి దాటవేశారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రిని కలిసిన టీడీపీ, వైసీపీ ఎంపీలు... ప్యాకేజీ, హోదాపై ప్రశ్నించగా... ఆయన ఆ అంశాన్ని దాటవేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర ఎంపీలు కూడా కేంద్రమంత్రిని కలిశారు. గత అయిదేళ్లలో ఏ రాష్ట్రానికీ ప్యాకేజీ ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. కరోనా దృష్ట్యా మూలధన వ్యయంలో పలు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకాన్ని మాత్రం కేంద్రం అమలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీలేని రుణాన్ని సమకూర్చినట్లుగా చెబుతున్నారు. ఈ స్కీమ్ కింద ఏపీకి 2020-21లో రూ. 688 కోట్లు, 2021-22లో 501.79 కోట్లు, 2022-23లో 6105.56 కోట్లు కేంద్రం విడుదల చేసింది. తెలంగాణకు 2020-21లో రూ. 358 కోట్లు, 2021-22లో 214.14 కోట్లు, 2022-23లో 2500.98 కోట్లు విడుదల చేసింది.


More Telugu News