మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమవుతున్న ఉత్తమ్.. నిర్మాణ సంస్థ వెంట ఉండేలా చూడాలని ఆదేశాలు
- నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం తీవ్ర విషయమని వ్యాఖ్య
- దీనిపై విచారణ జరగాల్సిందేనని వ్యాఖ్య
సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టును నిర్మించిన సంస్థను, ఆ సమయంలో ఉన్న అధికారులను వెంట ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు నిర్మాణం జరిగింది? ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంత? తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరగాల్సిందేనని చెప్పారు. ఈరోజు ఆయన నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.