మంత్రి కాకాణికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్
- చంద్రబాబును విమర్శించే స్థాయి కాకానికి లేదన్న బుచ్చయ్య చౌదరి
- రైతులకు, వ్యవసాయానికి మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్
- తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ. 10 వేల కోట్ల సాయం అందించాలని డిమాండ్
కల్తీ మద్యం, ఇసుక అక్రమ రవాణా, సిలికాన్ దోపిడీలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మునిగి తేలుతున్నారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. చంద్రబాబుకు సవాల్ విసిరేంత స్థాయి కాకాణికి లేదని ఆయన అన్నారు. రైతులకు, వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం ఏం చేసిందో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. విజయవాడలో ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో ఆధారాలతో నిరూపించాలని అన్నారు.
తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే రూ. 10 వేల కోట్ల సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి, నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో తాము అంకెలతో సహా నిరూపిస్తామని చెప్పారు. 7 లక్షల కోట్ల బడ్జెట్ లో తమ టీడీపీ ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లను కేటాయించి 24 ప్రాజెక్టులను పూర్తి చేసిందని తెలిపారు.