హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి

  • గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి
  • బీఆర్ఎస్ నేతలు విశ్రాంతి తీసుకోవాలని సూచన
  • ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రోజుల క్రితం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మహిళలకు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని ఆమె... మహిళలకు వివరించారు. అనంతరం ఆమె ఏబీఎన్‌తో మాట్లాడుతూ... బీఆర్ఎస్ వాళ్ళని చూస్తే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ నేతలు ఇక విశ్రాంతి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తమకు రాని ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు కుళ్లుకొంటున్నారన్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని, దాని వల్ల సోమరిపోతులు అవ్వడం ఉండదన్నారు.


More Telugu News