చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. తొలిసారి 70 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

  • ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
  • 70,083 పాయింట్లను టచ్ చేసిన సెన్సెక్స్
  • 21 వేలను దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు చరిత్ర సృష్టించాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 70 వేల మార్క్ ను దాటింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 70,083 పాయింట్లకు ఎగబాకి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నప్పటికీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 11.20 గంటల సమయంలో సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 69,947 వద్ద... నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 21,004 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు 20 వారాల గరిష్ఠానికి చేరుకోవడం మన మార్కెట్లపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతోంది.


More Telugu News